గురువారం 02 ఏప్రిల్ 2020
International - Feb 09, 2020 , 01:25:43

పాస్‌పోర్టు లేకుండా కర్తార్‌పూర్‌లోకి!

పాస్‌పోర్టు లేకుండా కర్తార్‌పూర్‌లోకి!
  • ప్రతిపాదనను పరిశీలిస్తున్న పాక్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌ కారిడార్‌లోకి భారతీయ యాత్రికులను పాసుపోర్టు లేకుండా అనుమతించే అవకాశమున్నది. పాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇజాజ్‌ షా శుక్రవారం ఆ దేశ పార్లమెంట్‌లో ఈ విషయాన్ని తెలిపారు. దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను ఎక్కువ మంది యాత్రికులు సందర్శించేందుకు వీలుగా ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖను కోరినట్లు జాతీయ అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన పేర్కొన్నారు. సిక్కుల గురువైన గురునానక్‌ తన జీవితంలో ఎక్కువకాలం గడిపిన పాక్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రం గురుదాస్‌పూర్‌లోని ప్రసిద్ధ డేరా బాబా నానక్‌ను కలుపుతూ నిర్మించిన కారిడార్‌ను గత ఏడాది నవంబర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం భారత పాసుపోర్టు కలిగిన యాత్రికులను కర్తార్‌పూర్‌ కారిడార్‌లోకి పాక్‌ అనుమతిస్తున్నది.


logo