గురువారం 09 ఏప్రిల్ 2020
International - Feb 23, 2020 , 15:03:40

‘కరోనా’ భయం ఎలా ఉందో చూడండి..వీడియో

‘కరోనా’  భయం ఎలా ఉందో చూడండి..వీడియో

చైనాతోపాటు ప్రపంచదేశాలను ఇపుడు కరోనా వైరస్‌ (కోవిద్‌-19)గడగడ వణికిస్తోన్న విషయం తెలిసిందే. చైనాలో ఇప్పటికే కరోనా మృతుల సంఖ్య 2వేలపైగా దాటింది. కరోనా భయానికి ఇద్దరు దంపతులు తమ శరీరాన్ని ప్లాస్టిక్‌ కవర్‌తో ప్యాక్‌ చేశారు. ఆస్ట్రేలియాలోని ఓ విమానంలో దంపతులిద్దరూ తమ నోటికి మాస్క్‌లు వేసుకుని, కరోనా వైరస్‌నుంచి తప్పించుకోవాలంటే నోటి మాస్కులు మాత్రమే సరిపోవని భావించినట్లున్నారు. ముఖానికి మాస్కులతోపాటు రెయిన్‌ షూట్‌లాగా కవర్‌ను కప్పుకున్నారు. మహిళేమో మంచి నిద్రలో ఉండగా..భర్తనేమో చేయి సర్దుకుంటున్న వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. పక్కనే ఉన్న ఎలిస్సా అనే ప్రయాణికురాలు ఈ వీడియో షేర్‌ చేసింది.


logo