శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 24, 2020 , 21:23:22

తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం.. విమానం, జెట్ రెండూ ద‌గ్గ‌ర‌కు రావ‌డంతో!

తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం.. విమానం, జెట్ రెండూ ద‌గ్గ‌ర‌కు రావ‌డంతో!

సిరియా గ‌గ‌న‌త‌లంపై రెండు యుద్ధ విమానాలు ద‌గ్గ‌ర‌గా రావ‌డంతో పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగేది.  యుఎస్ ఫైట‌ర్‌జెట్, ఇరాన్ విమానం రెండూ  ఎదురుప‌డ‌డంతో ప్ర‌యాణికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకునేందుకు విమానాన్ని ప‌క్క‌కు తిప్పాల్సి వ‌చ్చి అటూ ఇటూ క‌దిలింది. దీని దెబ్బ‌కి కొంత‌మంది కింద ప‌డిపోయారు. మ‌రికొంత‌మందికేమో గాయాల‌య్యాయి. 

ఈ వీడియో చూసిన‌ట్లు అయితే ప్ర‌యాణికుల ప‌రిస్థితి అర్థ‌మ‌వుతుంది. ఫ్లైట్ క‌ద‌ల‌డంతో త‌ల‌ల‌కు ర‌క్త‌స్రావం కూడా జ‌రిగింది. ఏదైమైనా అంతా క్షేమంగానే ఉన్నారు. ఏ మాత్రం తేడా జ‌రిగినా రెండు విమానాలు ఢీ కొట్టుకొని పెద్ద విధ్వంస‌మే జ‌రిగేది. 


   


logo