బుధవారం 21 అక్టోబర్ 2020
International - Sep 21, 2020 , 14:27:49

వీల్‌చైర్‌లో దొంగ‌త‌నానికి వ‌చ్చిన దొంగ‌.. తుపాకీతో అంద‌రినీ బెదిరిస్తూ..

వీల్‌చైర్‌లో దొంగ‌త‌నానికి వ‌చ్చిన దొంగ‌.. తుపాకీతో అంద‌రినీ బెదిరిస్తూ..

కాళ్లు, చేతులు ఉండి సూప‌ర్ ప్లాన్ వేసుకొని వ‌స్తేనే దొంగ‌ల‌ను పోలీసులు ప‌ట్టుకొని లాక‌ప్‌లో వేస్తున్నారు. అలాంటిది ఈ దొంగ ఎలాంటి ప్లాన్ లేకుండా దొంగ‌త‌నానికి వ‌చ్చాడు. వ‌చ్చింది కారులోనో, బైక్‌లోనో కాదు. వీల్‌చైర్‌లో. ప‌క్ష‌వాతం వ‌ల్ల కాళ్లు చ‌చ్చుబ‌డి వీల్‌చైర్‌కే ప‌రిమిత‌మైన అత‌ను కాళ్ల‌తో గ‌న్ ప‌ట్టుకొని వ‌చ్చాడు. షాపులో ఉన్న‌వాళ్ల‌కి గ‌న్ గురిపెట్టి బెదిరిస్తూ దొంగ‌త‌నం చేస్తున్నాడు. ఈ స‌మాచారం పోలీసుల‌కు వెళ్ల‌నే వెళ్లింది.

వారు హుటాహుటిన ఆ షాపు వ‌ద్ద‌కు చేరుకొని దొంగ‌ను అద‌పులోకి తీసుకున్నారు. తీరా చూస్తే ఆ గ‌న్‌, డ‌మ్మీ తుపాకీ అని తేలింది. అత‌నికి మ‌తిస్థిమితం స‌రిగా లేక‌పోయే స‌రికి ఇలా చేశాడ‌ని పోలీసులు పేర్కొన్నారు. దీని కార‌ణంగానే అరెస్ట్ చేసిన కాసేప‌టికే అత‌న్ని విడుద‌ల చేశారు. ఈ సంఘ‌ట‌న అంతా అక్క‌డే ఉన్న సీసీకెమెరాలో రికార్డు అయింది. దీన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయింది. ప్రొఫెష‌న‌ల్ దొంగ‌లు దొంగ‌త‌నం చేసిన విధంగానే ఇత‌ను చేశాడంటూ నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న బ్రెజిల్‌లో చోటు చేసుకున్న‌ది. ఇత‌న్ని విడుద‌ల చేసిన‌ప్ప‌టికీ  విచార‌ణ మాత్రం కొన‌సాగుతుంద‌ని పోలీసులు వెల్ల‌డించారు. 

 


logo