సోమవారం 19 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 19:22:27

ప‌క్ష‌వాతానికి గురైన కుక్క‌.. బ‌య‌ట‌కు వెళ్దాం అన‌గానే..!

ప‌క్ష‌వాతానికి గురైన కుక్క‌.. బ‌య‌ట‌కు వెళ్దాం అన‌గానే..!

ఆరోగ్యంగా ఉన్న కుక్క‌లు ఒక నిమిషం కూడా క‌దులుగా ఉండ‌లేవు. అలాంటిది ప‌క్ష‌వాతానికి గుర‌వ‌డంతో ఈ కుక్క ఎటూ క‌ద‌ల్లేని ప‌రిస్థితి. అయినా య‌జ‌మాని ఉండ‌గా ఈ పెట్‌కు ఆ భ‌యం, దిగులు అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఎక్క‌డికైనా ఈ కుక్క‌ను వెంట తీసుకెళ్తాడు. ఈ కుక్క‌ను బ‌య‌ట‌కు వెళ్దాం అన‌గానే అస‌లు నేల మీద ఆగ‌ట్లేదు. ఉరుకుతుంది. ప‌దా ప‌దా అంటూ అటూ ఇటూ గెంతుతున్న‌ది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ వీడియోను అమెరిక‌న్ మాజీ బాస్కెట్‌బాల్ క్రీడికారుడు రెక్స్ చాప్మ‌న్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

56 సెకండ్ల‌పాటు నడిచే ఈ వీడియోకు టైమ్‌లైన్ శుభ్ర‌ప‌ర‌చండి. ఒక అమ్మాయి త‌న న‌డ‌క‌ను సాగించ‌డానికి చాలా ఉత్సాహంగా ఉంది అనే శీర్షిక‌ను జోడించారు. ఇందులో కుక్క వెను కాళ్లు ప‌క్ష‌వాతంతో చ‌చ్చుబ‌డిపోయాయి. కుక్క జీను చూసిన వెంట‌నే సంతోషంగా ఎగురుతుం‌ది. ఈ జీను ద్వారా కుక్క చాలా సులువుగా న‌డుస్తుంది. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు ఐదు ల‌క్ష‌ల‌కు పైగా వీక్షించారు. 


logo