మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Oct 24, 2020 , 18:11:30

ప..ప..ప..ప..పాపడమ్‌.. ప..ప..ప..ప పాపడమ్‌..!ట్రెండింగ్‌ సాంగ్‌

ప..ప..ప..ప..పాపడమ్‌.. ప..ప..ప..ప పాపడమ్‌..!ట్రెండింగ్‌ సాంగ్‌

వేడి వేడి అన్నంలోకి ఆవకాయ కలుపుకొని తింటే.. ఆ మజానే వేరు. గుత్తొంకాయతో తింటే ఆ ఆనందమే వేరు.. మన వంటలపై సినిమా పాటలు ఎన్నోవచ్చాయి. విదేశీయులు సైతం మన వంటకాలను మెచ్చుకుంటూ వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అప్పడం పాట వైరల్ అవుతున్నది.

ఈ వీడియోలో విదేశీయుల బృందం సాంప్రదాయ దుస్తులను ధరించి, వారికి ఇష్టమైన చిరుతిండిని చేతిలో పట్టుకొని "పాపడం, పాపడం, పాపడం" అనే పాట పాడారు. ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ అష్మీ షేర్ చేశారు. "స్పష్టంగా చెప్పాలంటే, ఇది నేను కోరుకున్న ప్రాతినిధ్యం కాదు" అని అ వీడియో శీర్షికగా పెట్టారు. ఈ వీడియో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో 1.6 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. దీనికి 19,700 లైక్‌లు, 9,600 రీట్వీట్‌లు వచ్చాయి. ఈ పాటను నెటిజన్లు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.