శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 17, 2020 , 21:47:41

క‌రోనా ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే పెళ్లి చేసుకున్న వ్య‌క్తి!

క‌రోనా ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే పెళ్లి చేసుకున్న వ్య‌క్తి!

క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికే చాలామందిని నాశ‌నం చేసింది. ఎవ‌రు ఎప్పుడు క‌రోనా బారిన ప‌డ‌తారో అని భ‌య‌ప‌డుతూ చ‌స్తున్నారు ప్ర‌జ‌లు.  ఈ మ‌హ‌మ్మారి ప్రియ‌మైన వారిని దూరం చేస్తున్న‌ది. కొంద‌రు ఇప్ప‌టికీ త‌మ శ‌క్తితో పోరాటం చేస్తున్నారు. అలాంటి క‌థే టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో చోటు చేసుకున్న‌ది.

కార్లోస్ మునిజ్ అనే వ్య‌క్తి ఒక‌వైపు క‌రోనాతో పోరాడుతూనే మ‌రోవైపు పెళ్లికి సిద్ద‌మ‌య్యాడు. గ్రేస్ అనే అమ్మాయికు మూడు ముళ్లు వేసి భార్య‌గా చేసుకున్నాడు. అత‌నికి క‌రోనా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. అప్పుడు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. అత‌న్ని న‌గ‌రంలోని మెథ‌డిస్ట్ ఆసుప‌త్రిలో చేర్చారు. రోజులు గ‌డుస్తున్నాయి. అత‌ని ఆరోగ్యం క్షీణించడంతో అత‌నిని ఐసియుకు మార్చారు. అయినా వీరిద్ద‌రినీ వేరు చేయ‌లేర‌ని నిరూపించ‌డానికి హాస్పిట‌ల్‌లోనే పెళ్లి చేసుకొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. 


logo