శనివారం 30 మే 2020
International - Mar 31, 2020 , 09:58:24

ఆడ‌వాళ్ల‌కు ఓ రోజు.. మ‌గ‌వాళ్ల‌కు ఓ రోజు

ఆడ‌వాళ్ల‌కు ఓ రోజు..  మ‌గ‌వాళ్ల‌కు ఓ రోజు

హైద‌రాబాద్‌: చాలా వ‌ర‌కు ప్ర‌పంచ దేశాలు ఏదో ర‌కంగా క్వారెంటైన్‌ ఆంక్ష‌లు విధించాయి. క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ప‌క్కాగా ప్లాన్ చేస్తున్నాయి. అయితే సెంట్ర‌ల్ అమెరికా దేశ‌మైన ప‌నామాలోనూ ఆంక్ష‌లు విధించారు. కానీ ఆడ‌వాళ్ల‌కు, మ‌గ‌వాళ్ల‌కు వేరువేరు రోజుల్లో బ‌య‌ట‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చారు.  మొత్తం 15 రోజుల పాటు ఆ దేశం లాక్ డౌన్ విధించింది.  అయితే సోమ‌వారం, బుధ‌వారం, శుక్ర‌వారం రోజుల్లో రెండు గంట‌ల పాటు షాపింగ్‌కు వెళ్లేందుకు ఆడ‌వాళ్ల‌కు అనుమ‌తి ఇచ్చారు. ఇక మంగ‌ళ‌వారం, గురువారం, శ‌నివారం రోజుల్లో బ‌ట‌య‌కు వెళ్లేందుకు మ‌గ‌వారికి అనుమ‌తి ఇచ్చారు.  ఆదివారం మాత్రం ఎవ‌రూ బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌దు.  కేవ‌లం మ‌న ప్రాణాల‌ను మ‌నం కాపాడుకునేందుకే ఈ క్వారెంటైన్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు ఓ మంత్రి తెలిపారు.  ప‌నామాలో ఇప్ప‌టి వ‌ర‌కు వెయ్యి మందికి వైర‌స్ సోకింది. 27 మంది చ‌నిపోయారు. 


logo