శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 20, 2020 , 14:58:20

11 ఏళ్ల పాలస్తీనా బాలుడు శాంతికోసం సంగీతాన్ని ఎంచుకున్నాడు..!

11 ఏళ్ల పాలస్తీనా బాలుడు శాంతికోసం సంగీతాన్ని ఎంచుకున్నాడు..!

గాజా: పాలస్తీనా, ఇజ్రాయెల్‌ రెండు దేశాల మధ్య ఎప్పుడూ యుద్ధ వాతావరణమే. దీంతో పాలస్తీనాలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పయారు. వారిలో చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడి చాలామంది బాల్యం బాంబు చప్పుళ్లమధ్యే గడిచిపోతోంది.  అయితే, పాలస్తీనావైపు ప్రపంచం దృష్టిని ఆకర్షించి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఓ  11 ఏళ్ల బాలుడు సంగీతాన్ని సాధనంగా ఎంచుకున్నాడు. శాంతిని కాంక్షిస్తూ అద్భుతమైన ర్యాప్‌లు పాడుతున్నాడు. ఇంటర్నెట్‌లో అతడి ర్యాపింగ్‌ దుమ్ములేపుతోంది. 

అబ్దెల్‌రెహమాన్‌ అల్‌శాంతి అనే 11 ఏళ్ల బాలుడి ర్యాప్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎక్కువ భాగం ఇజ్రాయెల్‌తో యుద్ధంలో ఉన్నందున పాలస్తీనియన్లు ఎదుర్కొనే కష్టాల గురించే ఉన్నాయి. తన మాతృభాష అరబిక్‌తోపాటు ఇంగ్లిష్‌లో కూడా ర్యాప్‌ పాడగలడు. ‘పాలస్తీనా ఆన్‌లైన్’ అనే పేజీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను కదిలించింది. అతడి ర్యాప్స్‌కు చాలామంది ముగ్ధులైపోయారు. ‘నేను గాజా నగరంలో జన్మించాను.. నేను మొదట విన్నది తుపాకీ కాల్పులు.. నా మొదటి శ్వాసలో నేను గన్‌పౌడర్ రుచి చూశాను...’ అంటూ అతడు ఆలపించిన ర్యాప్‌ వీడియోను చాలా మంది వీక్షించారు. అమెరికాలో పోలీసుల చేతిలో క్రూరంగా హతమైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ స్మారకార్థం కూడా అతడు ర్యాప్‌ పాడి, అందరి దృష్టిని ఆకర్షించాడు.  


logo