గురువారం 22 అక్టోబర్ 2020
International - Oct 18, 2020 , 13:14:42

ఆర్మీ చీఫ్ బూట్లు క‌డిగి న‌వాజ్ ప్ర‌ధాని అయ్యారు: ఇమ్రాన్‌ఖాన్‌

ఆర్మీ చీఫ్ బూట్లు క‌డిగి న‌వాజ్ ప్ర‌ధాని అయ్యారు: ఇమ్రాన్‌ఖాన్‌

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్ర‌స్తుత‌‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల‌ మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతున్న‌ది. ఆర్మీ చీఫ్ బ‌జ్వా త‌న ప్రభుత్వాన్ని కూలదోసి తోలుబొమ్మ ప్రభుత్వానికి బాటలు వేశారన్న నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై ఇమ్రాన్‌ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్మీ చీఫ్ బూట్లను శుభ్రం చేయడంవ‌ల్లే అప్ప‌ట్లో నవాజ్ ష‌రీఫ్‌ గద్దెనెక్కారని ఇమ్రాన్ మండిప‌డ్డారు. 

దేశం కోసం తమ జీవితాల‌ను త్యాగం చేస్తున్న జవాన్లను అవమానించే విధంగా ష‌రీఫ్‌ మాట్లాడారని ఇమ్రాన్‌ఖాన్ దుయ్య‌బ‌ట్టారు. దేశం కోసం, దేశ ప్ర‌జ‌ల కోసం సైన్యం తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న‌ద‌ని, షరీఫ్ మాత్రం న‌క్క‌లా విదేశాల‌కు పారిపోయాడ‌ని ఇమ్రాన్‌ఖాన్ ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి ఆర్మీచీఫ్ గురించి, ఐఎస్‌ఐ చీఫ్ గురించి త‌ప్పుడు మాట‌లు మాట్లాడ‌టం దుర్మార్గ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo