గురువారం 28 మే 2020
International - Apr 29, 2020 , 18:37:14

భార‌త ‌దౌత్య‌వేత్త‌కు పాకిస్థాన్ స‌మ‌న్లు

భార‌త ‌దౌత్య‌వేత్త‌కు పాకిస్థాన్ స‌మ‌న్లు

న్యూఢిల్లీ:‌ భారత రాయ‌బార కార్యాల‌యానికి చెందిన సీనియర్ అధికారికి పాకిస్థాన్‌ ప్రభుత్వం బుధ‌వారం  స‌మన్లు జారీచేసింది. స‌రిహ‌ద్దుల్లో భారత బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ఆ స‌మ‌న్ల‌లో నిర‌స‌న వ్య‌క్తం చేసింది. రఖ్‌చిక్రీ సెక్టార్‌లో భారత బలగాలు కారణం లేకుండా కాల్పులు జరపడంవల్ల ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయ‌ని పాకిస్తాన్ విదేశాంగశాఖ ఆరోపించింది.

నియంత్రణ రేఖను ఆనుకుని ఉన్న జనావాసాలు లక్ష్యంగా భారత్ శక్తివంతమైన కాలిబర్ మోర్టార్లు, ఆటోమేటిక్‌ ఆయుధాలతో కాల్పులు జరుపుతున్న‌ద‌ని అభాండాలు వేసింది. వాస్తవానికి పాకిస్థాన్ సైన్య‌మే భారత సరిహద్దుల‌ వెంట‌ పదేపదే కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న‌ది. ఇవేమీ ఎరుగ‌న‌ట్లు పాకిస్థాన్ ప్ర‌భుత్వం భారత దౌత్యాధికారికే సమన్లు జారీచేసి అతి తెలివి ప్ర‌ద‌ర్శించింది.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo