గురువారం 28 మే 2020
International - Apr 17, 2020 , 18:07:44

పాకిస్థాన్ వంక‌ర బుద్ది మార‌దా..?

పాకిస్థాన్ వంక‌ర బుద్ది మార‌దా..?

న్యూఢిల్లీ: క‌రోనా ర‌క్క‌సి ప్ర‌పంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. దీంతో ఆ మ‌హ‌మ్మారి బారి నుంచి త‌మ ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవ‌డానికి అన్ని దేశాల ప్ర‌భుత్వాలు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నాయి. కానీ మ‌న పొరుగు దేశం పాకిస్థాన్ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉన్న‌ది. ఒక‌వైపు దేశంలో క‌రోనా విజృంభిస్తుంటే దాన్ని క‌ట్ట‌డి చేయ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిపోయి స‌రిహ‌ద్దుల్లో పొరుగు దేశాల‌తో క‌య్యాల‌కు కాలు దువ్వుతున్న‌ది. త‌ర‌చూ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాల‌ను ఉల్లంఘిస్తూ త‌న బుద్ధి ఎప్పుడూ వంక‌రే అని నిరూపించుకుంటున్న‌ది. 

తాను పెంచి పోషిస్తున్న ఉగ్ర‌వాదులను స‌రిహ‌ద్దుల గుండా భార‌త భూభాగంలోకి ప్ర‌వేశ‌పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా పాకిస్థాన్ త‌ర‌చూ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న‌ది. తాజాగా అఫ్గానిస్థాన్ ద్వారా భార‌త భూభాగంలోకి ఉగ్ర‌వాదుల‌ను ప్ర‌వేశ‌పెట్టేలా పాకిస్థాన్ కుట్ర ప‌న్నింది. ముందుగా అఫ్గానిస్థాన్ భూభాగంలోకి  తాలిబ‌న్ గ్రూపులను పంపి, అక్క‌డి నుంచి క‌శ్మీర్‌లో చొర‌బ‌డి దాడుల‌కు పాల్ప‌డేలా ప్లాన్ చేసింది. అంతేగాక జైషే ఉగ్ర‌వాదుల‌తో క‌లిసి అఫ్ఘానిస్థాన్‌లోని భార‌త ఆస్తుల‌ను ధ్వంసం చేయాల‌ని కూడా తాలిబ‌న్ల‌ను ఆదేశించింది. 

ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం త‌మ దేశ‌ స‌రిహ‌ద్దుల్లో తాలిబ‌న్‌, జైషే ఉగ్ర‌వాదుల క‌ద‌లిక‌ల‌ను అఫ్గానిస్థాన్ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ప‌సిగ‌ట్టాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై కాల్పులు జ‌రిపాయి. ఈ కాల్పుల్లో 15  మంది ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్రాణాల‌తో ప‌ట్టుబ‌డ్డ ఒక ఉగ్ర‌వాది భార‌త్‌కు వ్య‌తిరేకంగా పాకిస్థాన్ ప‌న్నిన కుట్రల గురించి వెల్ల‌డించిన‌ట్లు అఫ్గానిస్థాన్ సైనిక వ‌ర్గాలు తెలిపాయి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo