గురువారం 28 మే 2020
International - Apr 03, 2020 , 11:00:50

పాకిస్థాన్‌లోనూ త‌బ్లిగీ జ‌మాత్‌.. రైవిండ్ న‌గ‌రం లాక్‌డౌన్‌

పాకిస్థాన్‌లోనూ త‌బ్లిగీ జ‌మాత్‌.. రైవిండ్ న‌గ‌రం లాక్‌డౌన్‌హైద‌రాబాద్‌: పాకిస్థాన్‌లో కూడా త‌బ్లిగీ జ‌మాత్ సంస్థ‌తో అక్క‌డ ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డుతున్నారు.  ప్ర‌స్తుతానికి త‌బ్లిగీ జ‌మాత్ ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న రైవిండ్ న‌గ‌రాన్ని లాక్‌డౌన్ చేశారు.  వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను నిలిపివేశారు.  ఆ న‌గ‌రంలో సుమారు 101 మంది మ‌త‌బోధ‌కుల‌కు నోవెల్ క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో ఉన్న త‌బ్లిగీ జ‌మాత్‌కు లింకు ఉన్న సంస్థ ఇదే. మ‌లేషియాలో కూడా త‌బ్లిగీ జ‌మాత్ బోధ‌కుల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. పాక్‌లోని రైవిండ్ మ‌ర్క‌జ్‌లో సుమారు 1218 మంది త‌బ్లిగీ జ‌మాత్ స‌భ్యులు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. అయితే వైర‌స్ సోకిన వారిని అక్క‌డ ప్ర‌భుత్వం ఖాతా షా కాకు త‌ర‌లించారు.  రైవిండ్‌ న‌గ‌రంలో సుమారు రెండు ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌ర్క‌జ్‌లో ఉన్న 900 మందిని ప్ర‌భుత్వం క్వారెంటైన్ చేసింది.  


logo