శనివారం 30 మే 2020
International - May 01, 2020 , 10:20:30

పాకిస్తాన్‌లో భారీగా త‌గ్గిన పెట్రోల్ ధ‌ర‌..?‌

పాకిస్తాన్‌లో భారీగా త‌గ్గిన పెట్రోల్ ధ‌ర‌..?‌

ఇస్లామాబాద్:‌ దాయాది దేశం పాకిస్తాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. భారీగా  పెట్రోల్, డీజిల్ ధరలు త‌గ్గిస్తూ ప్ర‌జ‌ల‌కు పెద్ద ఊర‌ట క‌లిగించింది. అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధ‌ర‌లు దిగిరావ‌డంతో పాకిస్తాన్‌..ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అక్క‌డి మీడియా పేర్కొంది.  పెట్రోల్ ధరను లీటర్ కు రూ. 20 రూపాయలు తగ్గించాలని నిశ్చయించుకుంది. అటు హై స్పీడ్ డీజిల్ ధర ఏకంగా రూ. 33.94 తగ్గించనున్నట్టు పాకిస్తాన్ ఆయిల్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ తెలిపింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తో చర్చించిన అనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేందుకు సిద్ధమైందని డాన్ పత్రిక ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. రేపటి నుంచే తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయని అందులో  పేర్కొంది. అటు కిరోసిన్ ధ‌ర‌లు కూడా భారీగా త‌గ్గుతాయ‌ని తెలిపింది.



logo