గురువారం 03 డిసెంబర్ 2020
International - Oct 29, 2020 , 16:37:28

కశ్మీర్‌పై పాక్‌ జూమ్‌ మీటింగ్‌.. రాముడి పాటలతో హ్యాక్‌!

కశ్మీర్‌పై పాక్‌ జూమ్‌ మీటింగ్‌.. రాముడి పాటలతో హ్యాక్‌!

న్యూఢిల్లీ: వివాదాస్పదంగా కశ్మీర్‌ అంశంపై పాకిస్తాన్‌ నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌ను హ్యాక్‌ చేసి భారత అనుకూల హ్యాకర్లు దాయాది దేశానికి గట్టి షాక్‌ ఇచ్చారు. ఈ సమావేశం మధ్యలో రాముడు, హనుమంతుడి పాటలను ప్లే చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

భారత్‌లో ఉన్న కశ్మీర్‌ భూభాగంపై చర్చించేందుకు పాకిస్తాన్‌ ప్రపంచవ్యాప్తంగా కొంతమందితో ఈ వివాదాస్పద జూమ్‌ మీటింగ్‌ను నిర్వహించింది. సమావేశం మొదట 16:55 నిమిషాల సమయంలో హనుమంతుడి పాట 'ఏక్ హి నారా, ఏక్ హి నామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్' పాట ప్లే అయ్యింది. 47వ నిమిషంలో రెండోసారి సమావేశం హ్యాక్‌ అయ్యింది. ఈ పాట సుమారు 2 నిమిషాలు ప్లే అయ్యింది. ఈ పాట వస్తున్నప్పుడు డాక్టర్ వలీద్ మల్లిక్ తన మైక్రోఫోన్‌ను మ్యూట్ చేయమని పదేపదే అభ్యర్థించాడు. ఇది జరుగుతుందని ముందే ఊహించానని మరొక వక్త పేర్కొన్నాడు. ఈ వీడియో ట్విట్టర్‌లో హల్‌చల్‌చేస్తోంది. నెటిజన్లు సరదా కామెంట్లు, మీమ్స్‌తో పాక్‌ను ఆడుకుంటున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.