సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 15, 2020 , 16:10:58

వందేమాతరం గీతాన్ని ఆలపించిన పాకిస్తానీలు

వందేమాతరం గీతాన్ని ఆలపించిన పాకిస్తానీలు

లండన్ : భారతీయ జాతీయ గీతాలను ఆలపించే పాకిస్తానీలు చాలా అరుదుగా ఉంటారు. ఆదివారం లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఎదుట  నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పాకిస్తానీలు.. వందేమాతరం గీతాన్ని ఆలపించి భారత్ కు మద్దతుగా.. చైనాపై వ్యతిరేకతను ప్రదర్శించారు. అక్కడే ఉన్న భారతీయులతో కరచాలనం చేశారు. చైనాను బహిష్కరించాలంటూ నినాదాలు చేశారు.

లండన్ లోని చైనా రాయబార కార్యాలయం వద్ద పలువురు పాకిస్తాన్ లోని కరాచీ వాసులు, కొందరు ఇరాన్ నుంచి వచ్చిన వారు చైనాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేట్టారు. ఈ సందర్భంగా తకు భారత్ అంటే లేదని చెప్పేందుకు వారు వందేమాతరం గీతాన్ని ఆలపించారు.

ఈ రోజు నా జీవితంలో మొదటిసారి వందే మాతరం గీతాన్ని పాడాను అని అజాకియా అనే వ్యక్తి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) లో ఉన్న మీర్పూర్ లో నివసిస్తున్న అమ్జాద్ అయూబ్ మీర్జా కూడా ఈ ప్రదర్శనలో పాలుపంచుకుననారు. ఈ సందర్భంగా మీర్జా మాట్లాడుతూ.. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా గిల్గిట్-బాల్టిస్తాన్‌లో వినాశనం జరుగుతున్నదని ఆరోపించారు. మా ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతున్నా పాకిస్తాన్ ప్రభుత్వం చైనాతో చేతులు కలపడం విచారకరమన్నారు. అమెరికా, కెనడాతోపాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో చైనాకు వ్యతిరేకంగా ఇలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించిన భారతీయులు.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు, ప్లకార్డులు చూపించి తమ సూపర్ పవర్ ఆటను నిలిపివేయాలని సూచించారు.

చైనాకు వ్యతిరేకంగా ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం లండన్ వీధుల్లో కూడా కనిపిస్తుంది. వాస్తవానికి శనివారం రాత్రి సెంట్రల్ లండన్‌లోని చైనీస్ ఎంబసీ భవనం గోడపై 'ఫ్రీ టిబెట్, ఫ్రీ హాంకాంగ్, ఫ్రీ ఉగార్స్' అనే పదాలతో ఉన్న చిత్రాన్ని వేలాడదీసి తమ నిరసన వ్యక్తం చేశారు.

తాజావార్తలు


logo