గురువారం 28 మే 2020
International - May 20, 2020 , 20:26:12

కరోనాతో ఎమ్మెల్యే మృతి

 కరోనాతో ఎమ్మెల్యే మృతి

లాహోర్‌: పాకిస్థాన్‌లో ఎమ్మెల్యే ఒకరు కరోనా వైరస్‌కు గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. షహీన్‌ రజా (65) అధికార తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ పార్టీ అభ్యర్థిగా పంజాబ్‌ నుంచి అసెంబ్లీకి ప్రాతినధ్యం వహిస్తున్నారు.  కరోనా వైరస్‌ వ్యాప్తి  చెందడంతో పాకిస్థాన్‌లో మరీ ముఖ్యంగా పంజాబ్‌ రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదుయ్యాయి. కరోనా వైరస్‌కు గురై తమ పార్టీ కార్యకర్తలు క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. వారితోపాటు ప్రజల్ని పరామర్శించేందుకు పలుమార్లు దవాఖానకు వెళ్లిరావడంతో ఆమెకు కూడా కరోనా వైరస్‌ అంటుకొంది. దాంతో ఆమెను గత  నెల 17న మయో దవాఖానలో చేర్చి చికిత్స ప్రారంభించారు. చివరకు బుధవారం సాయంత్రం కన్నుమూసినట్లు దవాఖాన సీఈవో డాక్టర్‌ అసద్‌ అస్లామ్‌ చెప్పారు. షహీన్‌ రజా ఇప్పటికే క్యాన్సర్‌ వ్యాధికి గురై చికిత్స తీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నారు. తమ పార్టీ  ఎమ్మెల్యే షహీన్‌ రజా మృతిపట్ల పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌, ఇతర మంత్రులు విచారం వ్యక్తంచేశారు. కాగా, ఇప్పటివరకు పాకిస్థాన్‌లో రికార్డుస్థాయిలో 45,898 మంది కరోనా వైరస్‌కు గురవగా.. 985 మంది మరణించారు. 


logo