మసూద్ అజార్‌ను 18లోగా అరెస్టు చేయండి: కోర్టు

ఇస్లామాబాద్: జైషే మహ్మద్ (జేఎం) చీఫ్ మసూద్ అజార్‌ను జనవరి 18లోగా అరెస్టు చేయాలని అధికారులను పాకిస్థాన్ కోర్టు ఆదేశించింది. టెర్రర్ ఫైనాన్సింగ్ ఆరోపణలపై ఐక్యరాజ్యసమితి నిషేధిత జాబితాలో ఉన్న మసూద్‌ను కోర్టులో ప్రవేశపెట్టాలని గతంలో ఆదేశాలు కూడా ఇచ్చింది. కాగా అతడ్ని శుక్రవారం కోర్టులో హాజరుపరచాలని స్థానిక ఉగ్రవాద నిరోధక విభాగాన్ని న్యాయమూర్తి నటాషా నసీమ్ సుప్రా ఆదేశించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాన్వాలా ఉగ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ) అజాద్ అరెస్ట్ కోసం గురువారం వారెంట్ జారీ చేసింది. ఈ నెల 18లోగా అరెస్ట్ చేయాలని ఉగ్రవాద నిరోధక విభాగాన్ని ఆదేశించింది.
కాగా మసూద్ అజార్ గత కొన్నేండ్లుగా పాకిస్థాన్‌లోనే ఉన్నట్లుగా కోర్టు ఆదేశాల ద్వారా తెలుస్తున్నది. అతడి ఆచూకీ గురించి తమకు తెలియదని అధికారులు, ఆ దేశ నేతలు ఇప్పటి వరకు చెప్పుకొచ్చారు. 2019లో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ దాడిలో మజూద్ అజార్ పాత్ర ఉన్నట్లు తగిన ఆధారాలను భారత్ సమర్పించినా పాక్ పట్టించుకోలేదు. ఫిబ్రవరిలో ఎఫ్ఏటీఎఫ్ సమీక్ష జరుగనుండటం నేపథ్యంలోనే అతడి అరెస్ట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండితాజావార్తలు
- ముఖ్యమంత్రికి కృతజ్ఞతలతో..
- ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
- ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
- కేటీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతారు
- సైదన్న జాతర సమాప్తం
- అవకాశమిస్తే.. కాదా! ఆకాశమే హద్దు
- సమన్వయంతో పని చేయాలి
- పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలి
- సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
- తల్లీబిడ్డల సంక్షేమం కోసమే మాతా శిశు దవాఖాన