బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 18, 2020 , 16:53:33

షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న పాక్‌, చైనా దేశాధినేత‌లు

షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న పాక్‌, చైనా దేశాధినేత‌లు

హైద‌రాబాద్‌:  క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌ద్దు. కేవ‌లం న‌మ‌స్తే చెబితే చాలు. ఇదే ఆరోగ్య సూత్రం అన్న ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. కానీ చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌, పాక్ అధ్య‌క్షుడు ఆరిఫ్ అల్వీలు.. ఆ రూల్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు.  ఆ ఇద్ద‌రూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.  బీజింగ్‌లో స‌మావేశ‌మైన నేత‌లు మీడియా ముందు ఇలా ఫోజు ఇచ్చారు.  కొన్ని శ‌క్తులు మ‌న‌ల్ని వేరు చేసేందుకు షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దు అన్న నియ‌మాన్ని పాటిస్తున్నాయ‌ని, కానీ వాళ్లు ఆ విష‌యంలో స‌క్సెస్ కాలేర‌ని పాక్ అధ్య‌క్షుడు అల్వీ అన్నారు.  విజృంభిస్తున్న క‌రోనాను చైనా ప‌ద్ధ‌తి ప్ర‌కారం అదుపులోకి తీసుకువ‌చ్చింద‌ని అల్వీ కితాబుఇచ్చారు. క‌రోనాపై తుది విజ‌యం సాధించేందుకు ప్ర‌జ‌లు పోరాటం చేస్తున్నార‌ని జీ జిన్‌పింగ్ అన్నారు.


logo