శనివారం 30 మే 2020
International - May 08, 2020 , 07:21:22

రేపటి నుంచి పాక్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేత

రేపటి నుంచి పాక్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేత

ఇస్లామాబాద్‌ : రేపటి నుంచి దేశవ్యాప్తంగా దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయనున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ... లాక్‌డౌన్‌ కూలీలు, చిన్న పరిశ్రమలు, సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. పాక్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు 24,954కు చేరుకున్నాయి. కోవిడ్‌-19 కారణంగా 593 మంది చనిపోయారు. నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం అనంతరం ఇమ్రాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. చాలామంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావునా లాక్‌డౌన్‌ ఎత్తేసేందుకే తాము నిర్ణయించినట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా లాక్‌డౌన్‌ను ఎంతోకాలం పొడిగించి భరించే స్థితిలో లేమన్నారు. దేశం పరిమిత నిధులను మాత్రమే కలిగి ఉందని.. వాటిని ఇప్పటికే ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేసినట్లుగా తెలిపారు. 

కాగా దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ జూలై 15వ తేదీ వరకు కొనసాగనున్నట్లు విద్యాశాఖ మంత్రి శఫ్కత్‌ మహమూద్‌ తెలిపారు. అన్ని బోర్డు ఎగ్జామ్స్‌ను రద్దు చేసినట్లుగా చెప్పారు. బోర్డు ఎగ్జామ్స్‌లో విద్యార్థులు గతంలో చూపిన ప్రతిభ ఆధారంగా మదింపు చేయనున్నట్లు పేర్కొన్నారు.


logo