International
- Dec 23, 2020 , 15:42:20
భారత దౌత్య అధికారికి పాక్ సమన్లు

ఇస్లామాబాద్: భారత్‌కు చెందిన సీనియర్ దౌత్య అధికారికి పాకిస్థాన్ బుధవారం సమన్లు జారీ చేసింది. సరిహద్దులోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి భారత బలగాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు దాయాది దేశం ఆరోపించింది. హాట్‌స్ప్రింగ్, జాండ్రోట్ సెక్టార్లలో మంగళవారం భారత్ బలగాలు జరిపిన కాల్పుల్లో 50 ఏండ్ల పౌరుడు మరణించారని, 16, 18 ఏండ్ల వయసుగల ఇద్దరు యువకులు, నాలుగేండ్ల చిన్నారికి గాయాలయ్యాయని పాక్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయం సీనియర్ దౌత్యవేత్తను పిలిపించి దీనిపై తన నిరసన వ్యక్తం చేసింది. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని సూచించింది. కాల్పుల విరమణ ఉల్లంఘన సంఘటనలపై దర్యాప్తు చేయాలని, నియంత్రణ రేఖ, సరిహద్దులో శాంతిని కొనసాగించాలని తెలిపింది.
తాజావార్తలు
- రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే రాజీనామా
- త్రిపుర సీఎం నివాసం వద్ద ఉపాధ్యాయుల నిరసన
- అత్యాధునిక ఫీచర్లతో న్యూ జీప్ కంపాస్
- తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
- యాప్‌లపై నిషేధం డబ్ల్యూటీవో నియమాల ఉల్లంఘనే..
- ట్రక్కును ఢీకొట్టిన అంబులెన్స్.. ఐదుగురు దుర్మరణం
- అమిత్ షా నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష
- పోకో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్...!
- అరెస్ట్ చేయకుండా ఆపలేం.. తాండవ్ మేకర్స్‌కు సుప్రీం షాక్
- కట్టమైసమ్మ చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం
MOST READ
TRENDING