సోమవారం 30 మార్చి 2020
International - Feb 19, 2020 , 02:19:22

పాక్‌ అణు క్షిపణి ‘రాడ్‌-2’ పరీక్ష విజయవంతం

పాక్‌ అణు క్షిపణి ‘రాడ్‌-2’ పరీక్ష విజయవంతం

ఇస్లామాబాద్‌: అణు సామర్థ్యం గల క్రూయిజ్‌ క్షిపణి ‘రాడ్‌-2’ను పాకిస్థాన్‌ విజయవంతంగా పరీక్షించింది. 600 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం దీనికి ఉన్నది. దీన్ని భూమిపై నుంచిగానీ, సముద్రంపై నుంచిగానీ పరీక్షించవచ్చు. పాక్‌ అధికారులు మాట్లాడుతూ రాడ్‌-2కు అధునాతన నావిగేషన్‌ వ్యవస్థను అనుసంధానించామని చెప్పారు. లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించడం దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో పాక్‌ శక్తిసామర్థ్యాలు మరింత పటిష్ఠం కానున్నాయని పేర్కొన్నారు.logo