సోమవారం 06 జూలై 2020
International - Jun 15, 2020 , 16:22:07

పాకిస్థాన్ లో పెరుగుతున్న కొవిడ్-19 కేసులు

పాకిస్థాన్ లో పెరుగుతున్న కొవిడ్-19 కేసులు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగిస్తున్నప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 5,248 కొత్త కేసులు నమోదవడంతో ప్రభుత్వం, ప్రజలు భయపడిపోతున్నారు. ఆదివారం నాటి కొత్త కేసులు కలుపుకొని ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,44,676 కు చేరుకొన్నది. కాగా, ఆదివారం ఒక్కరోజునే 97 మంది చనిపోయారు. దాంతో మరణించినవారి సంఖ్య 2,729 కి చేరుకొన్నది. పాకిస్థాన్ జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 29,085 నిర్ధారత పరీక్షలు జరుపగా.. మొత్తం పరీక్షల సంఖ్య 8,97.650 గా ఉన్నది. ఇప్పటివరకు నమోదైన కేసలు 1,44,676 కేసుల నుంచి పంజాబ్ లో54,138, సింధ్ లో 53,805, ఖైబర్ పంఖ్తుంఖ్వాలో 18,013, ఇస్లామాబాద్ లో 8,569, బెలూచిస్తాన్ లో 8,177, గిల్గిట్ -బాల్టిస్థాన్లో 1,129, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో 647 కేసులు నమోదయ్యాయి. జూలై నెల చివరికల్లా రోగుల సంఖ్య 12 లక్షలకు చేరుకొనే అవకాశాలు ఉన్నట్టు పాకిస్థాన్ ప్రణాళిక మంత్రి అసద్ ఉమర్ ఆదివారం హెచ్చరించారు.


logo