శనివారం 30 మే 2020
International - Apr 04, 2020 , 13:05:25

పంజాబ్‌ కేంద్రంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌

పంజాబ్‌ కేంద్రంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌

హైదరాబాద్‌: దాయాది దేశం పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. శనివారం నాటికి ఈ కేసుల సంఖ్య 2708కి చేరింది. అయితే ఈ వైరస్‌ వేగంగా విస్తరించడానికి ఆ దేశంలోని పంజాబ్‌ ప్రావిన్స్‌ ప్రధాన కేంద్రంగా మారింది. ఇప్పటికవరు నమోదైన మొత్తం కేసుల్లో 1072 ఆ ప్రావిన్స్‌కు చెందినవే. దేశంలోని మొత్తం జనాభాల్లో సగానికిపైగా పంజాబ్‌లోనే ఉండటంతో ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. పాక్‌లో ఇప్పటివరకు కరోనాతో 40 మంది మరణించారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచబ్యాంకు 200 మిలియన్ల అమెరికన్‌ డాలర్లను పాకిస్థాన్‌కు సహాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 


logo