బుధవారం 08 జూలై 2020
International - Jun 27, 2020 , 10:58:30

పాక్‌లో భారీగా పెరిగిన పెట్రో ధరలు

పాక్‌లో భారీగా పెరిగిన పెట్రో ధరలు

ఇస్లామాబాద్‌: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన తయారైంది పాక్‌ ప్రజల పరిస్థితి. అసలే కరోనా వైరస్‌తో అతలాకుతలమైతున్న ప్రజలపై, పెరిగిన ముడిచమురు ధరల భారం ఒక్కసారిగా వచ్చిపడింది. దేశంలో పెట్రోలియ ఉత్పత్తులపై రూ.26 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   

దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100కు చేరింది. నిన్నటిదాకా రూ.74.52గా ఉన్న లీటర్‌ పెట్రోల్‌పై రూ.25.58పైసలు వడ్డించింది. రూ.38.14గా ఉన్న లీటర్‌ డీజిల్‌ ధర రూ.17.84 పెరిగి రూ.55.98కి చేరింది. హైస్పీడ్‌ డీజిల్‌ ధర రూ.21.31పైసలు పెరిగి రూ.101.26 అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరడంతో పెట్రో ఉత్పత్తుల ధరలు పెచామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ధరలు జూన్‌ 30 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది.


logo