గురువారం 28 మే 2020
International - Apr 22, 2020 , 12:38:49

స్వీయ నిర్బంధంలో పాకిస్థాన్ ప్ర‌ధాని

స్వీయ నిర్బంధంలో పాకిస్థాన్ ప్ర‌ధాని

హైద‌రాబాద్‌: పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.  ఇటీవ‌ల ఆయ‌న ఓ ప్ర‌ముఖ దాత‌ను క‌లిశారు. ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది. దీంతో తాను సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్తున్న‌ట్లు ప్ర‌ధాని ఇమ్రాన్ తెలిపారు.   ఇమ్రాన్‌తో ఇటీవల ప్రముఖ దాత, ఎది ఫౌండేషన్‌ చైర్మన్‌ ఫైసల్‌ ఎది సమావేశమయ్యారు. ఫైసల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఇమ్రాన్ కూడా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు.  మంగ‌ళ‌వారం ఇమ్రాన్ శ్యాంపిళ్ల‌ను డాక్ట‌ర్లు సేక‌రించారు. స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్ ప్ర‌కారం శ్యాంపిళ్లు సేక‌రించిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు.  పాజిటివ్ వ్య‌క్తిని ఇమ్రాన్ క‌లిసినందుకు ఈ ప‌రీక్ష త‌ప్ప‌లేదు. పాక్‌లో క‌రోనా మృతుల సంఖ్య 200 దాటింది. 

ఎది ఫౌండేష‌న్‌కు చెందిన ఫైస‌ల్ ఇటీవ‌ల ఇమ్రాన్‌కు ప‌ది మిలియ‌న్ల చెక్‌ను అంద‌జేశారు.  పారిశ్రామిక‌వేత్త అబ్దుల్ స‌త్తార్ ఎది కుమారుడే ఫైస‌ల్ ఎది. క‌రోనా సోకిన వ్య‌క్తితో ఓ రూమ్‌లో 15 నిమిషాలు మాట్లాడినా లేక అత‌నికి ఆరు ఫీట్ల లోపు ద‌గ్గ‌ర‌గా ఉన్నా.. వైర‌స్ సంక్ర‌మించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పాక్ జాతీయ ఆరోగ్య సంస్థ అభిప్రాయ‌ప‌డింది. ఈ నేప‌థ్యంలోనే ఇమ్రాన్‌కు ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.  ఇద్ద‌రు షేక్ హ్యాండ్ ఇచ్చుకోక‌పోయినా.. అందుకున్న చెక్ నుంచి వైర‌స్ ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.  logo