గురువారం 28 మే 2020
International - Apr 20, 2020 , 17:03:51

దే..వుడా కరోనా అటు నుంచి కూడా వస్తుందట!

దే..వుడా కరోనా అటు నుంచి కూడా వస్తుందట!

న్యూఢిల్లీ: ప‌్రాణాంత‌క కరోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి ల‌క్ష‌న్న‌ర మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ను అంతం చేయ‌డానికి అన్ని దేశాలు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నాయి. క‌రోనా బాధితులు తుమ్మడం, ద‌గ్గ‌డంవ‌ల్ల వారి నుంచి వెలువ‌డే తుంప‌ర్ల ద్వారా.. క‌రోనా బాధితుల‌ను, వారు తాకిన ప్ర‌దేశాల‌ను చేతితో తాకిన‌ప్పుడు చేతుల ద్వారా ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి చెందుతుంద‌ని వైద్యులు స్ప‌ష్టంచేశారు. 

ఈ నేప‌థ్యంలో అన్ని దేశాల ప్ర‌భుత్వాలు త‌మ‌ ప్ర‌జ‌లను ముఖాల‌కు మాస్కులు ధ‌రించాల‌ని, చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కోవాల‌ని ప‌దేప‌దే కోరుతున్నాయి. కానీ పాకిస్థాన్ ప్ర‌ధానికి అసిస్టెంట్ అయిన ఫిర్దౌస్ అషిక్ మాత్రం క‌రోనా జాగ్ర‌త్త‌ల్లో భాగంగా ఒక విచిత్ర సూచ‌న చేశారు. ఇటీవ‌ల ఒక మీడియా స‌మావేశంలో మాట్లాడిన ఆమె.. క‌రోనా రాకుండా ఉండాలంటే ముఖానికి మాస్కులు ధ‌రించి, చేతులు క‌డుక్కుంటే స‌రిపోద‌ని, క‌రోనా కేవ‌లం పై నుంచే రాద‌ని, కింద నుంచి కూడా వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించారు. 

అందుకే ప్ర‌జ‌లు కాళ్లు, పాదాలు కూడా క‌న‌ప‌డ‌కుండా క‌ప్పుకోవాల‌ని ఫిర్దౌస్ అషిక్‌ సెల‌విచ్చారు. ఫిర్దౌస్ కామెంట్లు విని విచిత్రంగా ముఖం పెట్టిన‌ మీడియా ప్ర‌తినిధులకు ఆమె రుజువులు కూడా చెప్పారు. క‌రోనా కింద నుంచి కూడా వ్యాపిస్తుంద‌ని వైద్య‌శాస్త్రంలోనూ ఉంద‌ని ఉప‌దేశించారు. కాగా, ఫిర్దౌస్ వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా.. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo