సోమవారం 03 ఆగస్టు 2020
International - Jul 10, 2020 , 21:47:48

కరోనా కేసుల్లో ఇటలీని అధిగమించిన పాకిస్థాన్‌

కరోనా కేసుల్లో ఇటలీని అధిగమించిన పాకిస్థాన్‌

న్యూఢిల్లీ :  పాకిస్థాన్‌లో కరోనా రోజురోజుకూ విస్తరిస్తోంది. ఆ దేశవ్యాప్తంగా నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా పాజిటివ్‌ కేసుల్లో ఆ దేశం ఇటలీని అధిగమించింది. ఇప్పటివరకు పాకిస్థాన్‌లో 2,43,599 కరోనా కేసులు నమోదుకాగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో 11వ స్థానానికి చేరిందని అమెరికాలోని జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది. గురువారం ఒక్కరోజే ఆ దేశంలో 2,751 మందికిపైగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సింధు ప్రావిన్స్‌లో ఇప్పటివరకు లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా పంజాబ్‌లో 85,261 కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో కరోనా మరణాల నమోదులో పాకిస్థాన్‌ 18వ స్థానంలో ఉంది.  గడిచిన 24గంటల్లో ఇక్కడ 76 మంది మృతి చెందగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,508కి చేరింది.logo