ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 13, 2020 , 07:34:38

‘పీవో’కే మెడికల్‌ కళాశాలల డిగ్రీలు చెల్లవు : ఎంసీఐ

‘పీవో’కే మెడికల్‌ కళాశాలల డిగ్రీలు చెల్లవు : ఎంసీఐ

న్యూఢిల్లీః జమ్ముకశ్మీర్‌ విద్యార్థులకు పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని మెడికల్‌ కాలేజీలు జారీచేసే మెడికల్‌ డిగ్రీలు చెల్లుబాటు కావని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) ప్రకటించింది. కశ్మీర్‌ యువతకు 1600 స్కాలర్‌షిప్‌లు ఇచ్చేందుకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటించిన పథకాన్ని కూడా భారత ప్రభుత్వం తిరస్కరించింది. పీవోకే మెడికల్‌ డిగ్రీలపై వైఖరి తెలుపాలని 2019 డిసెంబర్‌లో ఎంసీఐ, విదేశాంగశాఖను జమ్ముకశ్మీర్‌ హైకోర్టు ఆదేశించటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. logo