శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 27, 2020 , 09:22:04

క‌రోనాకు మ‌హిళ‌లే కార‌ణ‌మ‌ట‌

క‌రోనాకు మ‌హిళ‌లే కార‌ణ‌మ‌ట‌

కోవిడ్‌-19 వైర‌స్ ధాటికి ప్ర‌పంచ‌మంతా క‌కావిక‌ల‌మ‌వుతున్న‌వేళ‌, దాని మూలాలు క‌నుగొనేందుకు అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ విప‌త్తును ఎవ‌రికి తోచిన‌ట్లు వారు అన్వ‌యించుకొని పుకార్లు వ్యాపింప‌జేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ మ‌త‌గువురు ఆ దేశ ప్ర‌ధాని స‌మ‌క్షంలోనే అత్యంత వివాదాస్ప‌దంగా మాట్లాడారు. మ‌హిళ‌లు చేస్తున్న పాపాల కార‌ణంగానే ప్ర‌పంచాన్ని క‌రోనా ప‌ట్టి పీడిస్తున్న‌ద‌ని మౌలానా తారిఖ్ జ‌మీల్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ టీవీచాన‌ల్ క‌రోనా రోగుల కోసం నిధుల సేక‌రించే ల‌క్ష్యంతో లైవ్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో జ‌మీల్‌తోపాటు పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ కూడా పాల్గొన్నారు. ఇందులో జ‌మీల్ మాట్లాడుతూ మ‌హిళ‌ల సంప్ర‌దాయానికి విరుద్ధ‌మైన వస్త్ర‌ధార‌ణ వ‌ల్ల‌నే దేశంలో క‌రోనా వ్యాపిస్తున్న‌ద‌ని వ్యాఖ్యానించారు. ప‌నిలో ప‌నిగా ఆయ‌న మీడియామీద కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. మీడియా అబద్ధాలు చెప్ప‌టంవ‌ల్ల కూడా క‌రోనా పెరుగుతున్న‌ద‌న్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై త‌న వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించుకోవ‌టం గ‌మ‌నార్హం.‌


logo