14 ఏండ్ల బాలికతో పెండ్లి.. పోలీసుల దర్యాప్తు

ఇస్లామాబాద్ : జమైతేఉలేమా ఇ ఇస్లాం నేత, పాకిస్తాన్ ఎంపీ మౌలానా సలాఉద్దీన్ అయూబి 14 ఏండ్ల బలూచిస్తాన్ బాలికను పెండ్లి చేసుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. మైనర్ బాలికతో ఎంపీ వివాహంపై పాకిస్తాన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిత్రాల్లో మహిళా సంక్షేమ రంగంలో పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్ చట్టాల ప్రకారం 16 ఏండ్లలోపు బాలికలతో వివాహాలను అనుమతించారు. బలూచిస్తాన్ ఎంపీ తన కంటే నాలుగు రెట్లు చిన్న వయసు కలిగిన బాలికను వివాహం చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని స్వచ్ఛంద సంస్థ దావతోఅజీమట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక జుగూర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతోందని, రికార్డుల ప్రకారం బాలిక 2006 అక్టోబర్ 28న జన్మించినట్టు తెలిసిందని డాన్ పత్రిక పేర్కొంది. ఎంపీతో వివాహంపై ఫిర్యాదు ఆధారంగా బాలిక గృహాన్ని ఇటీవల పోలీసులు సందర్శించగా తమ కుమార్తెకు పెండ్లి కాలేదని ఆమె తండ్రి వెల్లడించారని తెలిపింది. మరోవైపు బాలికతో ఎంపీ నిఖాను పక్కా చేసుకున్నారని, వివాహ వేడుక ఇంకా జరగలేదని పాక్ అబ్జర్వర్ పేర్కొంది.
తాజావార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఫోటోలు ఇలా డిలిట్
- పెట్టుబడిదారులకు లిటిల్ సీజర్స్ న్యూ బిజినెస్ ప్రపోజల్
- భారత్‌పై సైబర్ దాడుల వార్తలు నిరాధారం:చైనా
- అక్షరమై మెరిసెన్..సయ్యద్ అఫ్రీన్!
- ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- కార్న్ దోశ
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..