సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 21, 2020 , 07:08:38

భార‌త్‌పై అణు‌బాం‌బు‌లేస్తాం.. పాక్ మంత్రి షేక్‌‌ర‌షీద్‌

భార‌త్‌పై అణు‌బాం‌బు‌లేస్తాం.. పాక్ మంత్రి షేక్‌‌ర‌షీద్‌

ఇస్లా‌మా‌బాద్‌: భార‌త్‌తో యుద్ధం జరి‌గితే అణు‌బాం‌బు‌లతో దాడి‌చే‌స్తా‌మని పాకి‌స్థాన్‌ ఫెడ‌రల్‌ రైల్వే‌శాఖ మంత్రి షేక్‌‌ర‌షీద్‌ రెచ్చ‌గొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘భారత సైన్యంతో పోల్చితే పాక్‌ సైన్యం వెను‌క‌బడి ఉన్నది. అందుకే చిన్న‌స్థాయి అణు‌బాం‌బుల తయా‌రీకి ప్రయ‌త్ని‌స్తున్నాం. భార‌త్‌పై అణు‌బాం‌బు‌లే‌సినా అక్కడి ముస్లిం‌లను రక్షిస్తాం’ అని పేర్కొ‌న్నారు. 

భార‌త్‌పై రెచ్చ‌గొట్టే వ్యాఖ్యలు చేయటం రషీ‌ద్‌కు కొత్తేమీ కాదు. పాక్‌ ప్రభు‌త్వంలో ఆయ‌నను ఐఎ‌స్‌ఐ గొంతు‌కగా భావి‌స్తారు. 2019లో పాకిస్థాన్ వ‌ద్ద 125 నుంచి 250 గ్రాముల అణ్వాయుధాలు ఉన్నాయ‌ని,  నిర్దేశిత ల‌క్ష్యాల‌ను అవి విచ్చిన్నం చేస్తాయ‌ని ప్ర‌క‌టించారు. క‌శ్మీర్ అంశంలో పాకిస్థాన్‌కు భార‌త ఆర్మీ నుంచి ప్ర‌మాదం పొంచి ఉన్న‌ద‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ‌  


logo