గురువారం 09 జూలై 2020
International - Jun 15, 2020 , 12:02:21

జూలై చివరినాటికి 12 లక్షలకు కరోనా కేసులు

జూలై చివరినాటికి 12 లక్షలకు కరోనా కేసులు

ఇస్లామాబాద్‌: దాయాది పాకిస్థాన్‌లో జూలై చివరినాటికి కరోనా కేసులు 12 లక్షలకు చేరుకోవచ్చని ఆ దేశ మంత్రి ఉమర్‌ ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు లక్షా 50 వేలకు చేరువలో ఉన్నాయని, ఇది ఇలాగే కొనసాగితే జూన్‌ చివరి నాటికి రెంట్టింపు అవ్వొచ్చని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేశంలో జూలై చివరి నాటికి ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగి పది నుంచి 12 లక్షలకు చేరుతుందని అన్నారు. దేశంలో కరోనా మహమ్మారికి సంబంధించి ఆయన బాధ్యులుగా ఉన్నారు. 

పాక్‌లో నిన్న ఒక్కరోజే 6825 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో 1,39,230కి చేరింది. కొత్తగా81 మంది చనిపోయారని, మొత్తం మరణించినవారి సంఖ్య 2632కి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాజధాని ఇస్లామాబాద్‌లో కొత్తగా 771 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఒక్క నగరంలోనే కరోనా కేసుల సంఖ్య 7934కి చేరింది. దేశంలో అత్యధికంగా పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఇప్పటివరకు 52,601 పాజిటివ్‌ కేసులు నమోదవగా, సింధ్‌ ప్రావిన్స్‌లో 51,518 మంది కరోనా బారినపడ్డారు.


logo