గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 09, 2020 , 11:02:29

పాల‌రాతి గ‌ని కింద‌ 22 మంది స‌జీవ‌స‌మాది

పాల‌రాతి గ‌ని కింద‌ 22 మంది స‌జీవ‌స‌మాది

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో పాల‌రాతి గ‌ని కూలిన ప్ర‌మాదంలో 22 మంది స‌జీవ స‌మాధి అయ్యారు. మంగ‌ళ‌వారం రాత్రి ప్రఖ్యాతిగాంచిన జియారత్‌ ఘర్‌ పర్వతప్రాంతంలోని పాలరాతి గనిలో ఘోరం ప్ర‌మాదం జ‌రిగింది. ఖైబర్‌ పఖ్తుంఖ్వాలోని పర్వతపాదం సమీపంలోగ‌ల‌ సఫీ పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పాలరాతి గనిలోని ఆరు యూనిట్లు కుప్పకూలడంతో 22 మంది కార్మికులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో తొమ్మిది మందిని రెస్క్యూ టీమ్స్ ర‌క్షించాయి. శిథిలాల కింద దాదాపు మ‌రో 20 మంది కార్మికులు చిక్కుకుపోయి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన స‌మ‌యంలో అక్కడ 45 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని డిప్యూటీ కమిషనర్‌ ఇఫ్తికార్ తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo