శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Sep 12, 2020 , 02:10:42

పాక్‌ది హింసా సంస్కృతి

పాక్‌ది హింసా సంస్కృతి

ఐరాస: పాకిస్థాన్‌ తన ‘హింసాసంస్కృతి’ని ఇంటాబయటా ప్రేరేపిస్తున్నదని భారత్‌ ఐక్యరాజ్యసమితి వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘన, మతపరమైన మైనారిటీల పట్ల పాక్‌ వ్యవహరిస్తున్న తీరు అంతర్జాతీయ సమాజానికి ఆందోళన కలగజేస్తున్నదని పేర్కొంది. కాగా, తమ దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్థాన్‌ తక్షణమే నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని భారత్‌, అమెరికా తేల్చిచెప్పాయి. 26/11 ముంబై ఉగ్రదాడులు, పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడులకు పాల్పడిన దోషులను చట్టం ముందు నిలబెట్టాలని సంయుక్త ప్రకటనలో డిమాండ్‌ చేశాయి. 


logo