సోమవారం 30 మార్చి 2020
International - Jan 24, 2020 , 02:06:46

ఘజ్నవిని పరీక్షించిన పాక్

ఘజ్నవిని  పరీక్షించిన పాక్
  • 290 కి.మీ. పరిధిలో లక్ష్యాల్ని చేధించే సామర్థ్యం ఈ క్షిపణి సొంతం

ఇస్లామాబాద్: ఉపరితలం నుంచి ఉపరితలానికి అణ్వస్ర్తాలు మోసుకెళ్లే సామర్థ్యం కల బాలిస్టిక్ క్షిపణి ఘజ్నవిని పాక్ మరోసారి విజయవంతంగా పరీక్షించింది. వ్యూహాత్మక సైనిక దళ కమాండ్‌కు నిర్వహించిన శిక్షణ లో భాగంగా గురువారం ఈ పరీక్ష జరిపినట్టు ఆ దేశ సైన్యం మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) తెలిపింది. పగలైనా, రాత్రైనా ఎలాంటి కార్యచరణకైనా సైన్యం సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో ఈ పరీక్ష జరిపాం అని ఐఎస్పీఆర్ పేర్కొంది. 290 కి.మీ. పరిధిలో లక్ష్యాల్ని చేధించగల సామర్థ్యం ఘజ్నవి సొంతమన్నది. పాక్ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ జాకీ మాంజ్‌తో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల సమక్షంలో ఈ పరీక్ష జరిగిందని పాక్ ప్రభుత్వం రేడియో తెలిపింది. ఈ పరీక్ష పాక్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్, త్రిదళాధిపతులు ప్రశంసించారు.


logo