సోమవారం 30 నవంబర్ 2020
International - Oct 19, 2020 , 06:46:19

గ్రే లిస్టులోనే పాక్‌?

గ్రే లిస్టులోనే పాక్‌?

న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్థాన్‌కు ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) మరోసారి షాకివ్వనుందని సమాచారం. ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయటంలో విఫలమైన పాకిస్థాన్‌ను గ్రే లిస్టులోనే కొనసాగించే అవకాశం ఉందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్‌, ఉగ్రవాద నిర్మూలన, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయటం వంటి 27 లక్ష్యాలను పాక్‌కు ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్దేశించగా, వాటిల్లో ఆరు అంశాల్లో పాక్‌ విఫలమైందని భారత విదేశాంగశా వర్గాలు ఆదివారం వెల్లడించాయి. అంతేకాకుండా ఎఫ్‌ఏటీఎఫ్‌ జాబితాలో ఉన్న 4వేల మంది ఉగ్రవాదులపై పాక్‌ ప్రభుత్వం ప్రయాణ షరతులను ఎత్తేయటం కూడా ఆ దేశంపై నమ్మకం కోల్పోయేలా చేసింది.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.