ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Sep 14, 2020 , 16:33:42

భారత సీనియర్ దౌత్య అధికారికి పాక్ సమన్లు

భారత సీనియర్ దౌత్య అధికారికి పాక్ సమన్లు

ఇస్లామాబాద్: భారత సీనియర్ దౌత్య అధికారికి పాకిస్థాన్ సోమవారం సమన్లు జారీ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తున్నదని పాక్ ఆరోపించింది. సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి హాట్‌స్ప్రింగ్ సెక్టార్‌లో భారత సైనిక దళాలు ఆదివారం రాత్రి విచక్షణారహితంగా, ప్రేరేపితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులకు తీవ్ర గాయాలైనట్లు పేర్కొంది. దీనిపై నిరసన తెలిపేందుకు ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్ దౌత్య అధికారికి సోమవారం సమన్లు జారీ చేసింది. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తామని, శాంతి ప్రక్రియకు సహకరిస్తామని భారత్ తెలిపిందని, అయితే ఆ దేశ సైన్యం దానికి కట్టుబడి ఉండటం లేదని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 2,245 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు జరిగాయని, 18 మంది మరణించగా 180 మంది గాయపడినట్లు పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo