గురువారం 29 అక్టోబర్ 2020
International - Oct 11, 2020 , 02:42:05

పాక్‌ ఆర్మీపై విపక్షాల భగ్గు

పాక్‌ ఆర్మీపై విపక్షాల భగ్గు

కరాచి: పాకిస్థాన్‌లో అత్యంత శక్తిమంతమైనదిగా పేరున్న సైన్యంపై దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ప్రతిపక్ష పార్టీలు ప్రత్యక్ష విమర్శలకు దిగాయి. 2018లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సైన్యమే రిగ్గింగుకు పాల్పడి ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ పార్టీని గెలిపించిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పాకిస్థాన్‌ పీపుల్స్‌పార్టీ (పీపీపీ), పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) ఆరోపించాయి. నవంబర్‌ 15న జరిగే గిల్గిత్‌ బాల్టిస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సైన్యం జోక్యం చేసుకుంటే గట్టి ప్రతిఘటన తప్పదని, అవసరమైతే ఇస్లామాబాద్‌ను ముట్టడిస్తామని పీపీపీ అధినేత బిలావల్‌భుట్టో జర్దారీ శుక్రవారం హెచ్చరించారు. లండన్‌లో ఉన్న మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ కూడా ఇటీవలే పాక్‌ సైన్యం, ఇమ్రాన్‌ఖాన్‌పై రిగ్గింగ్‌  ఆరోపణలు చేశారు.