శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 13, 2020 , 18:13:43

దేవుడు మనతో ఉన్నాడు.. పాక్ మసీదుల్లో లాక్‌డౌన్ బేఖాతరు

దేవుడు మనతో ఉన్నాడు.. పాక్ మసీదుల్లో లాక్‌డౌన్ బేఖాతరు

హైదరాబాద్: ప్రపంచంలో రెండో అతిపెద్ద ముస్లిం దేశమైన పాకిస్థాన్‌లో కరోనా లాక్‌డౌన్ అంతగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. దేవుడు మనతో ఉన్నాడు అనే ధీమాతో చాలామంది నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. మసీదులకు ఎలాంటి మాస్కులు, జాగ్రత్తలు లేకుండానే జనాలు వస్తున్నారు. పశ్చిమదేశాలవారికి సోకినట్టుగా మాకు ఈ వైరస్ సోకదని మసీదుపెద్ద చెప్పాడని ముల్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి మీడియాకు చెప్పాడు. మేము రోజుకు ఐదుసార్లు ప్రార్థనకు చేతులు, ముఖం కడుక్కుంటాం.. కాఫిర్లు అలా చేయరు.. కనుక మేము భయపడాల్సింది ఏమీ లేదు. దేవుడిు మాతో ఉన్నాడు అని ఆయన అన్నారు.

20 కోట్ల పైచిలుకు జనాభా కలిగిన పాకిస్థాన్‌లో మతపెద్దల హవా నడుస్తుంది. మతపరమైన పార్టీలు ఎన్నికల్లో గెలవనప్పటికీ మతపరమైన విషయాల్లో జనాలను రెచ్చగొట్టడం చేస్తుంటాయి. మతం, ప్రార్థన వంటివి పాకిస్థానీయులకు భావావేశంతో కూడిన అంశాలు.. ప్రభుత్వం వీటి విషయంలో సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది అని పాక్ ప్రధానికి సన్నిహితుడైన ఓ అధికారి చెప్పారు. కానీ సమస్య ఏమిటంటే పాకిస్థాన్‌లోని 60 శాతం కరోనా కేసులు మతపరమైన కార్యక్రమాల కారణంగా వ్యాపించినవే.


logo