మంగళవారం 31 మార్చి 2020
International - Jan 28, 2020 , 18:07:31

ఆయుధాలతో వచ్చి పెళ్లికూతురిని ఎత్తుకెళ్లారు..

ఆయుధాలతో వచ్చి పెళ్లికూతురిని ఎత్తుకెళ్లారు..

కరాచీ: కాసేపట్లో పెళ్లి ఉండగా వరుడు మాయం..వధువు కనిపించడం లేదు..అనే వార్తలు వింటుంటాం..కానీ ఓ హిందూ పెళ్లికూతురును  ఏకంగా పెళ్లి మండపం నుంచే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో వెలుగుచూసింది. హలాపట్టణంలో 24 ఏళ్ల భారతిభాయ్‌ పెళ్లి మండపంలో ఉండగా..కొంతమంది వ్యక్తులు పోలీసుల వస్త్రధారణలో ఆయుధాలతో వచ్చి..భారతీభాయ్‌ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత భారతిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి ముస్లిం వ్యక్తి షారుక్‌ గుల్‌తో పెళ్లి చేశారు.

భారతి 2019లో ఇస్లాం మతం స్వీకరించినట్లుగా ఉన్న ధృవీకరణ పత్రాలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. బానోరి పట్టణంలోని జమియాత్‌ ఉల్‌ ఉలూమ్‌ ఇస్లామియాలో భారతీభాయ్‌ను ఇస్లాం మతంలోకి చేర్పించి..ఆమె పేరు బుస్రాగా నామకరణం చేసినట్లు షారుక్‌ గుల్‌ తెలిపాడు. పాకిస్థాన్‌ జనాభాలో హిందువులు 2 శాతం ఉండగా..ప్రత్యేకించి సింధ్‌ ప్రావిన్స్‌లో ఉన్న హిందువులను బలవంతంగా ఇస్లాం మతంలోకి చేర్పిస్తున్నారు. గతంలో కూడా జకోకాబాద్‌ జిల్లాలో 15 ఏళ్ల హిందూ బాలికను ఇస్లాం మతంలోకి మార్చి ముస్లిం వ్యక్తితో పెళ్లి జరిపించారు. 


logo
>>>>>>