బుధవారం 27 జనవరి 2021
International - Jan 02, 2021 , 01:08:31

ఆలయ విధ్వంసంపై పాక్‌ కోర్టులో విచారణ

ఆలయ విధ్వంసంపై పాక్‌ కోర్టులో విచారణ

పెషావర్‌/న్యూఢిల్లీ: ఖైబర్‌-పఖ్తుం ఖ్వా రాష్ట్రంలోని కరక్‌ జిల్లాలో అల్లరిమూకలు హిందూ ఆలయాన్ని ధ్వంసం చేయడాన్ని పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ నెల 5వ తేదీన ఈ అంశంపై విచారణ జరుపనున్నది. ఆలయ ధ్వంసంపై 4వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని మైనార్టీ హక్కుల సంఘం చైర్మన్‌, ఖైబర్‌-పఖ్తుంఖ్వా రాష్ట్ర సీఎస్‌, పోలీస్‌ చీఫ్‌లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్‌ అహ్మద్‌ ఆదేశించారు. మరోవైపు విధ్వంసానికి గురైన ఆలయాన్ని ప్రభుత్వమే తిరిగి నిర్మిస్తుందని పఖ్తుంఖ్వా రాష్ట్ర ముఖ్యమంత్రి మహమూద్‌ ఖాన్‌ శుక్రవారం ప్రకటించారు. దాడితో సంబంధం ఉన్న 45 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఆలయ విధ్వంసంపై పాక్‌లోని హిందువులు కరాచీలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 


logo