శనివారం 16 జనవరి 2021
International - Dec 13, 2020 , 16:55:50

డంప్‌స్టర్‌లో దొరికిన 2.5 కోట్ల విలువైన పెయింటింగ్

డంప్‌స్టర్‌లో దొరికిన 2.5 కోట్ల విలువైన పెయింటింగ్

బెర్లిన్: జర్మనీలోని డ్యూసెల్డార్ఫ్ విమానాశ్రయంలో కనిపించకుండాపోయిన విలువైన పెయింటింగ్‌ రీసైక్లింగ్‌ డంప్‌స్టర్‌ వద్ద లభించింది. ఈ సర్రియలిస్ట్ పెయింటింగ్ విలువ దాదాపు  280,000 యూరోలు ( భారత కరెన్సీలో రూ.2.5 కోట్లు) గా ఉంటుందని అధికారులు లెక్కించారు. 

నవంబర్ 27 న డ్యూసెల్డార్ఫ్ నుంచి టెల్ అవీవ్ వెళ్లే విమానంలో వెళ్తున్న ఓ వ్యాపారవేత్త అనుకోకుండా చెక్-ఇన్ కౌంటర్ వద్ద పెయింటింగ్‌ను అక్కడే పెట్టి మరిచిపోయి వెళ్లిపోయాడు. అతను ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టిన తర్వాత తాను విమానాశ్రయంలో పెయింటింగ్ వదిలిపెట్టిన విషయం గుర్తుకొచ్చింది. దాంతో ఆయన డ్యూసెల్డార్ఫ్ పోలీసులను సంప్రదించాడు. కేసు నమోదు చేసుకున్న డ్యూసెల్డార్ఫ్‌ పోలీసులు ఆ పెయింటింగ్‌ కోసం వెతకడం ప్రారంభించగా.. ఈ కళాకృతికి సంబంధించిన వివరాలతో చాలా ఈ మెయిల్‌లు ఉన్నప్పటికీ 40-బై-60 సెంటీమీటర్ల పెయింటింగ్‌ను పోలీసులు గుర్తించలేకపోయారని పోలీసు ప్రతినిధి ఆండ్రీ హార్ట్‌విగ్ తెలిపారు. చివరకు వ్యాపారవేత్త మేనల్లుడు బెల్జియం నుంచి జర్మనీకి వెళ్ళినప్పుడు ఈ పెయింటింగ్ గుర్తించాడు. ఎంతోవిలువైన ఆ పెయింటింగ్‌ను ఒక ఇన్స్‌పెక్టర్.. పేపర్ రీసైక్లింగ్ డంప్‌స్టర్‌ వద్ద గుర్తించగలిగాడు. ఎట్టకేలకు విలువైన పెయింటింగ్‌ తన వద్దకు చేరడంతో ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.