మంగళవారం 31 మార్చి 2020
International - Mar 11, 2020 , 14:44:18

కుప్పకూలిన పాక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ : పైలట్‌ మృతి

కుప్పకూలిన పాక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ : పైలట్‌ మృతి

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ కుప్పకూలింది. పాకిస్తాన్‌ డేను ఈ నెల 23న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇస్లామాబాద్‌లో రిహార్షల్స్‌ నిర్వహించారు. రిహార్షల్స్‌లో భాగంగా గాల్లోకి ఎగిరిన ఎయిర్‌క్రాఫ్ట్‌ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో వింగ్‌ కమాండర్‌ నౌమాన్‌ అక్రమం మృతి చెందాడు. ఈ ప్రమాదాన్ని పాక్‌ అధికారులు ధృవీకరించారు. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్లు ఇస్లామాబాద్‌ మేయర్‌ షేక్‌ అన్సర్‌ అజిజ్‌ వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన కూడా పాక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కుప్పకూలిన విషయం తెలిసిందే. రెండు నెలల్లో ఇది మూడో ప్రమాదమని అక్కడి అధికారులు తెలిపారు. 



logo
>>>>>>