శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 11, 2020 , 12:53:27

టీకా విఫ‌లంపై నిరుత్సాహ‌ప‌డ‌వ‌ద్దు : సౌమ్యా స్వామినాథన్

టీకా విఫ‌లంపై నిరుత్సాహ‌ప‌డ‌వ‌ద్దు :  సౌమ్యా స్వామినాథన్

హైద‌రాబాద్‌: ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా కోవిషీల్డ్‌ వేసుకున్న ఓ వలంటీరుకు ఇటీవల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో లండ‌న్‌లోని అస్ట్రాజెనెకా క్లినికల్‌ ట్రయల్స్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. కొవిషీల్డ్‌ టీకా ప్రస్తుతం రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్ స్పంఇంచారు.  టీకా అభివృద్ధిలో ఎత్తు ప‌ల్లాలు ఉంటాయ‌ని, ఇదో హెచ్చ‌రిక లాంటింద‌ని, ఇలాంటి సంద‌ర్భాల‌ను ఎదుర్కొనేందుకు మ‌నం ముందే సంసిద్ధం అయి ఉండాల‌ని స్వామినాథన్ తెలిపారు. జెనీవాలో వ‌ర్చుల్ మీడియా స‌మావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. టీకా ట్ర‌య‌ల్స్ నిలిపివేత‌పై నిరుత్సాహ‌ప‌డ‌వద్దు అని, ఇలాంటివి జ‌రుగుతూనే ఉంటాయ‌న్నారు.  

కోవిషీల్డ్ టీకా తీసుకున్న వలంటీరులో నరాల సమస్యలు తలెత్తడంతో దాని సమర్థతపై అనేక సందేహాలు తలెత్తున్నాయి. సమస్యకు కారణం టీకానేనా, వేరే ఏదైనా అంశమా అన్నది స్పష్టం చేయాలని ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు, వైద్యనిపుణులు, చట్టసభల ప్రతినిధులు అస్ట్రాజెనెకాను కోరుతున్నారు. మరోవైపు,  ప్రస్తుతం ట్రయల్స్‌ నిలిచిపోయినప్పటకీ ఈ ఏడాది చివరికి టీకా అందుబాటులోకి రావచ్చని సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పాస్కల్‌ సోరియట్‌ చెప్పారు. మ‌రో వైపు ఇండియాలో కూడా సీరం సంస్థ కోవిషీల్డ్ టీకా ట్ర‌య‌ల్స్‌ను నిలిపివేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. 
logo