బుధవారం 25 నవంబర్ 2020
International - Oct 27, 2020 , 02:25:22

వారంలో టీకా!

వారంలో టీకా!

లండన్‌: కరోనా మహమ్మారికి మరో వారంరోజుల్లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌  రాబోతున్నట్టు లండన్‌లోని ఓ ప్రఖ్యాత దవాఖాన పేర్కొంది. నవంబర్‌ 2 (సోమవారం) నుంచి టీకా డోసులను పంపిణీ చేయడానికి బ్రిటన్‌ వైద్య సేవల యంత్రాంగం (ఎన్‌హెచ్‌ఎస్‌) ప్రణాళికలను సిద్ధం చేసిందని తెలిపింది. ఎన్‌హెచ్‌ఎస్‌ నుంచి తొలి విడుత వ్యాక్సిన్‌ డోసులు అందగానే, దేశంలోని వేలాదిమంది వైద్యులు, నర్సులకు టీకాలను వేయిస్తామన్నది. ఈ మేరకు ‘ది సన్‌' దినపత్రిక ఓ వార్తను ప్రచురించింది.