శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Sep 13, 2020 , 05:51:36

ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌ మళ్లీ షురూ

ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌ మళ్లీ షురూ

  • టీకా భద్రమేనని తేలడంతో నిర్ణయం

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌ మళ్లీ ప్రారంభమయ్యాయి. టీకా భద్రతపై నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ.. టీకా సురక్షితమైనదేనని చెప్పడంతో ట్రయల్స్‌ మళ్లీ మొదలుపెట్టినట్టు శనివారం ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా బ్రిటన్‌లో టీకా వేయించుకున్న ఓ వలంటీర్‌లో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ట్రయల్స్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ భద్రతను సమీక్షించేందుకు ఓ స్వతంత్య్ర నిపుణుల కమిటీ ఏర్పాటైంది. కమిటీ సభ్యులు చేసిన దర్యాప్తులో వ్యాక్సిన్‌ భద్రమేనని తేలింది. దీంతో ప్రయోగాలు మళ్లీ ప్రారంభించేలా అనుమతులనివ్వాలని మెడిసన్స్‌ హెల్త్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్‌ఆర్‌ఏ)కి కమిటీ సిఫారసు చేసింది. దీంతో ఎంహెచ్‌ఆర్‌ఏ నుంచి అనుమతులు రావడంతో ప్రయోగాలను బ్రిటన్‌లో తిరిగి ప్రారంభించినట్టు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. కాగా, కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి రాగానే తాము కూడా ట్రయల్స్‌ ప్రారంభిస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొన్నది. 


logo