ఆక్స్ఫర్డ్ టీకాకు యూకే ఆమోదం..

హైదరాబాద్: కొత్త రకం స్ట్రెయిన్‌తో సతమతం అవుతున్న బ్రిటన్‌కు ఇది ఊరటనిచ్చే వార్త. కరోనా వైరస్ నియంత్రణ కోసం యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు రూపొందించిన వ్యాక్సిన్‌కు బ్రిటన్ ఆమోదం తెలిపింది. ఇక యూకేలో భారీ స్థాయిలో ఇమ్యూనైజేషన్ ప్రక్రియ కొనసాగనున్నది. కొత్త వేరియంట్‌తో అతలాకుతలం అవుతున్న బ్రిటన్ ఈ టీకాతో మళ్లీ గాడిలోపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్ట్రాజెన్‌కా సంస్థ ఆక్స్ఫర్డ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్నది. అయితే సుమారు 10 కోట్ల డోసులను యూకే ఆర్డర్ చేసింది. 5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ మొత్తంలో ప్రొక్యూర్ చేస్తున్నారు. బ్రిటన్‌లో జనజీవితం సాధారణ స్థాయికి వచ్చేందుకు ఈ టీకా ఎంతో ఉపకరిస్తుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
ఆక్స్ఫర్డ్ టీకాకు ఆమోదం దక్కడం అంటే.. ఆ టీకా సురక్షితంగా, సమర్థవంతంగా ఉన్నట్లే అని తెలుస్తోంది. మెడికల్ రెగ్యులేటర్లు ఆక్స్ఫర్డ్ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. బ్రిటన్ ప్రజలకు శుభసంకేతం. కరోనా వైరస్ మహమ్మారిగా మారిన తొలి రోజుల్లోనే ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకాను రూపొందించింది. ఏప్రిల్‌లోనే ఆ సంస్థ తొలి వాలంటరీ పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత వేలాది మందిపై భారీ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఊహించని రీతిలో ఆక్స్ఫర్డ్ టీకా అభివృద్ధి జరిగింది. మహమ్మారి ఎంత వేగంగా విస్తరించిందో.. అంతే వేగంగా టీకాను అభివృద్ధి పరిచారు. వాస్తవానికి అమెరికాకు చెందిన ఫైజర్ టీకాకు తొలుత బ్రిటన్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
6 లక్షల మందికి..
బ్రిటన్‌లో ఇప్పటికే ఆరు లక్షల మందికి టీకాను ఇచ్చేశారు. తొలి టీకాను 90 ఏళ్ల బామ్మ మార్గరేట్ కీనన్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. ఫైజర్ టీకాను ఆమెకు ఇచ్చారు. అయితే ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకా పంపిణీ విస్తృత స్థాయిలో జరిగే అవకాశం ఉన్నది. ఆ టీకా అతి చౌక కావడం వల్ల జోరుగా వ్యాక్సినేషన్ జరుగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉత్పత్తి కూడా వేగంగా జరగనున్నది. జనవరి 4వ తేదీ నుంచి బ్రిటన్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హాన్కాక్ తెలిపారు.
మొదట ఒక్క డోసు మాత్రమే..
ఫైజర్ టీకాను స్టోర్ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ ఫ్రిజ్‌లు కావాల్సి ఉంది. ఎందుకంటే ఆ టీకాను నిల్వ చేసేందుకు మైనస్ 70 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు కావాలి. కానీ ఆక్స్ఫర్డ్ టీకాను మాత్రం సాధారణ ఫ్రిడ్జ్‌ల్లో నిల్వ చేయవచ్చు. దీని వల్ల ఈ టీకాను ఎక్కడికైనా తీసుకువెళ్లడం సులువు అవుతుంది. పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ శాఖ నుంచి వ్యాక్సిన్‌కు అప్రూవల్ దక్కింది. వన్ డోస్ స్ట్రాటజీలో టీకాను పంపిణీ చేయనున్నారు. తొలి దశలో వీలైనంత మందికి .. తొలి డోసును ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇమ్యునైజేషన్ క్యాంపేన్‌లో భాగంగా ఈ ప్రక్రియను అమలు చేయనున్నారు. వన్ డోస్ విధానం వల్ల అభ్యాగులకు, అనాథలకు కోవిడ్ నుంచి రక్షణ ఏర్పడే అవకాశం ఉన్నది. రెండు డోసులు ఇవ్వడం కన్నా.. అవసరమైన వారికి తక్షణమే తొలి డోసు ఇవ్వడం కోసం కార్యాచరణ రూపొందించినట్లు ఆరోగ్యశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. తొలి డోసు తీసుకున్న 12 వారాల్లోపు రెండవ డోసు ఇవ్వనున్నారు. వైరస్ నుంచి అతి దీర్ఘకాల రక్షణ కోసం రెండవ డోసు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది.
తాజావార్తలు
- జగత్ విఖ్యాత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దు
- పునర్జన్మలపై నమ్మకమే మదనపల్లి హత్యలకు కారణం !
- అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
- పార్లమెంట్ మార్చ్ వాయిదా : బీకేయూ (ఆర్)
- ఢిల్లీ సరిహద్దులో గుడారాలు తొలగిస్తున్న రైతులు
- హెచ్-1 బీ నిపుణులకు గ్రీన్ కార్డ్.. షార్ట్‌కట్ రూటిదే?!
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి
- ఇద్దరు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు
- రేపు ఏపీ గవర్నర్‌ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం
- పవన్ కళ్యాణ్‌కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు