శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 01, 2020 , 06:51:49

అమె‌రి‌కాకు షాక్‌.. చైనాకు సొంత నావి‌గే‌షన్‌ వ్యవస్థ

అమె‌రి‌కాకు షాక్‌.. చైనాకు సొంత నావి‌గే‌షన్‌ వ్యవస్థ

బీజింగ్‌: చైనా తన సొంత నావి‌గే‌షన్‌ వ్యవస్థ ‘బీ‌డో’ను విజ‌య‌వం‌తంగా అభి‌వృద్ధి చేసింది. ఆ దేశ అధ్య‌క్షుడు జిన్‌‌పింగ్ బీజిం‌గ్‌‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌లో ఈ వ్యవ‌స్థను అధి‌కా‌రి‌కంగా ప్రారం‌భిం‌చారు. జూన్‌ 23న ప్రయో‌గిం‌చిన 55వ మరియు చిట్ట‌చి‌వరి జియో స్టేష‌నరి ఉప‌గ్రహం సమ‌ర్థంగా పని‌చే‌స్తుం‌డ‌టంతో నావి‌గే‌షన్‌ ప్రాజెక్టు పూర్త‌యిం‌దని తెలి‌పారు. 

అమె‌రి‌కాకు చెందిన గ్లోబల్‌ పొజి‌ష‌నింగ్‌ సిస్ట‌మ్‌‌కు(‌జీ‌పీ‌ఎస్‌) పోటీగా చైనా బీడోను అభి‌వృద్ధి చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రి‌క్త‌తల నేప‌థ్యంలో చైనా తన సొంత నావి‌గే‌షన్‌ వ్యవ‌స్థను ప్రారం‌భిం‌చడం ప్రాధాన్యం సంత‌రిం‌చు‌కు‌న్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా త‌న చివ‌రి ఉప‌గ్ర‌హాన్ని జూన్ 23న ప్ర‌యోగించింది. దీంతో ప్రాజెక్టు పూర్తి ఆప‌రేష‌న్‌కు కావాల్సిన 35 ఉప‌గ్ర‌హాలు క‌క్ష్య‌లోకి చేరాయి. దీంతో సొంత నావిగేష‌న్ వ్య‌వ‌స్థ క‌లిగిన అమెరికా, ర‌ష్యా, యూర‌ప్ స‌ర‌స‌న చైనా నిలిచింది. 


logo