గురువారం 16 జూలై 2020
International - May 25, 2020 , 02:05:47

విజయావకాశాలు 50 శాతమే!

విజయావకాశాలు 50 శాతమే!

  • ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ బృంద సభ్యుడు అడ్రియన్‌

లండన్‌: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీ రేసులో ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన  ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్‌ విజయవంతమయ్యే అవకాశాలు 50శాతం మాత్రమేనని పరిశోధనల్లో పాలుపంచుకుంటున్న శాస్త్రవేత్త అడ్రియన్‌ హిల్‌ తెలిపారు. దీనికి కారణం బ్రిటన్‌లో వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడమేనని చెప్పారు. సమూహంలో వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉండటంవల్ల పదివేల మంది వలంటీర్లపై చేసే వ్యాక్సిన్‌ పరీక్షల్లో ఫలితం కనిపించకపోవచ్చని ఆయన తెలిపారు. దీంతో 50 శాతం ఫలితాలు సరిగ్గా రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ‘ఆస్ట్రాజెనెకా’తో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధికి కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. 


తాజావార్తలు


logo